epaper
Tuesday, March 3, 2026
epaper

25 రోజులకు సరిపడ ఇంధన నిల్వలున్నాయి : కేంద్రం

కలం, వెబ్​ డెస్క్​: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఇజ్రాయెల్​–అమెరికా దళాల దాడులతో హర్మూజ్​ జలసంధిని ఇరాన్​ మూసివేసింది. ఈ క్రమంలో ఇంధన నిల్వల(Crude Oil – Gas) కొరత వస్తుందనే ఆందోళనలపై కేంద్రం స్పందించింది. ఎలాంటి ఆందోళన వద్దని, 25 రోజులకు సరిపడ క్రూడాయిల్​, గ్యాస్​ నిల్వలు ఉన్నాయని మంగళవారం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను ఉటంకిస్తూ నేషనల్​ మీడియా పేర్కొంది.

‘క్రూడాయిల్​, ఎల్​పీజీ, ఎల్​ఎన్​జీ నిల్వల విషయంలో మనం కంఫర్టబుల్​ పొజిషన్​లోనే ఉన్నాం. ప్రస్తుతం మన వద్ద 25 రోజలకు సరిపడ ఇంధన నిల్వలు ఉన్నాయి. మరో 25 రోజులకు సరిపోయే ఆయిల్​ ఉత్పత్తులు రవాణాలో ఉన్నాయి’ అని అధికారులు వెల్లడించినట్లు తెలిపింది.

కాగా, హర్మూజ్​ జలసంధి (Strait of Hormuz) మూసివేతతో ఆయిల్ ఉత్పత్తుల(Crude Oil – Gas) సరఫరాపై ఆందోళనలు పెరిగాయి. ప్రపంచ క్రూడ్ ఆయిల్‌లో ఐదో వంతు ఈ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. ఈ క్రమంలో తమపై ఇజ్రాయెల్​–అమెరికా దళాల దాడులకు ప్రతిగా ఈ జలసంధిని మూసివేసినట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్​జీసీ) కమాండర్ సలహాదారు ఇబ్రహీం జబ్బారి ప్రకటించారు. ఎవరైనా దాటాలనుకుంటే తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

అనంతరం జలసంధి నుంచి దాదాపు 90% క్రూడ్ రవాణా నిలిచిపోయింది. సాధారణంగా రోజుకు 100కు పైగా ట్యాంకర్లు ఈ మార్గం నుంచి దాటితే, ఆదివారం మూడు మాత్రమే దాటగలిగాయి. సోమవారం ఆ సంఖ్య ఒక్కటికి పడిపోయింది. జలసంధిని దాటే ప్రయత్నంలో కొన్ని ఓడలు, ఆయిల్ ట్యాంకర్లు దాడికి గురయ్యాయి.

Read Also: కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ.. వాటిపైనే చర్చ

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!