కలం, వెబ్ డెస్క్ : నెల్లూరు (Nellore) జిల్లా కోవూరులో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. భగత్ సింగ్ కాలనీకి చెందిన వలీ అనే వ్యక్తి స్థానిక హోటల్‌లో భోజనం చేస్తుండగా, ఒక రక్తపింజరి పాము అతనిని కాటు వేసింది. దీంతో అతడు ఆ పామును అక్కడే చంపేశాడు.
పాము కాటు వేయడంతో తనకు ప్రాణాపాయం కలగవచ్చనే ఆందోళనతో నేరుగా ఆసుపత్రికి బయలుదేరాడు. అయితే తనను కాటేసిన పాము ఏ రకానికి చెందినదో వైద్యులకు చూపించాలనే ఉద్దేశంతో చనిపోయిన ఆ పామును కూడా వెంటబెట్టుకుని వచ్చాడు.
చేతిలో పామును పట్టుకుని అతను ఆసుపత్రిలోకి ప్రవేశించడంతో అక్కడున్న రోగులు, వైద్య సిబ్బంది షాక్‌కు గురయ్యారు. వైద్యులు బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య కోసం అతడిని నెల్లూరులోని ప్రధాన ఆసుపత్రికి తరలించారు.
Read Also: అరవ శ్రీధర్ వివాదంలో ట్విస్ట్.. హైకోర్టుకు హర్షవీణ
Follow Us On: Instagram

