కలం, వెబ్ డెస్క్: హర్మూజ్ జలసంధిలో మరో ఆయిల్ ట్యాంకర్‌పై(MKD VYOM) దాడి జరిగింది. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఒమన్‌లోని మస్కట్ తీరానికి 52 నాటికల్ మైళ్ల దూరంలో మార్షల్ ఐలాండ్స్ జెండా ఉన్న ఎంకేడీ వ్యోమ్ చమురు నౌక వెళుతుండగా, ఓ మానవరహిత పడవ వేగంగా దూసుకొచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆయిల్ ట్యాంకర్‌తో మంటలు చేలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించాయి. నౌకలోని మెయిన్ ఇంజిన్ రూమ్‌ను బలంగా ఢీకొట్టడంతో.. అక్కడున్న సిబ్బందిలో ఒకరు మరణించారు.
చనిపోయినవ్యక్తి భారత పౌరుడని ఒమన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇది ఉద్ధేశ్యపూర్వకంగా జరిగిన దాడిగా భావిస్తున్నట్లు తెలిపింది. ప్రమాదం జరిగిన నౌకలో(MKD VYOM) మొత్తం 21 మంది సిబ్బంది ఉన్నారని, వీరిలో 16 మంది భారతీయులు, 4 బంగ్లాదేశీయులు, ఒకరు ఉక్రెయిన్‌కు చెందినవాళ్లని వెల్లడించింది. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినవాళ్లను మరో నౌక ద్వారా క్షేమంగా ఒడ్డుకు చేర్చినట్లు తెలిపింది.
కాగా, అమెరికా–ఇజ్రాయెల్ (US – Israel) సంయుక్త దాడుల్లో అధ్యక్షుడు అయతొల్లా ఖమేనీతోపాటు మరికొందరు కీలక నేతలను కోల్పోయిన ఇరాన్ ప్రతీకార దాడులతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పర్షియన్, ఒమన్ గల్ఫ్‌లను కలిపే హర్మూజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలను సైతం లక్ష్యంగా చేసుకుంది. ఆదివారం ఒక ట్యాంకర్‌పై డ్రోన్ దాడి జరిగింది. ఇందులోని 15 మంది భారతీయులు సహా సిబ్బంది మొత్తం త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకున్నారు.
ఈ క్రమంలో మరో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి జరగడం కలకలం సృష్టిస్తోంది. ఇరాన్‌కు మద్దతు తెలిపిన హూతీ ఉగ్రవాద సంస్థ.. సోమవారం ఆయిల్ ట్యాంకర్‌పై దాడికి కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: పరుగులు చేయలేకపోతే తప్పుకోవాల్సిందే.. అభిషేక్‌పై నాయర్ హాట్ కామెంట్స్
Follow Us On: Youtube

