కలం, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మార్షల్ ఆర్ట్స్ మెళకువలు నేర్పించారు. మార్షల్ ఆర్ట్స్‌ను వ్యక్తిగత జీవితానికి, రాజకీయ జీవితానికి ఎలా అన్వయించుకోవాలో వివరించారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ లో తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు శిక్షణ (DCC Presidents Training) తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ పలు సూచనలు చేశారు.
శిక్షణ తరగతుల్లో భాగంగా కాంగ్రెస్ ఐడియాలజీపై క్లాస్ చెప్పారు. ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలను వారికి వివరించారు. అంతర్జాతీయ అంశాలను కాంగ్రెస్ నేతలకు వివరించారు పాకిస్థాన్‌కి చైనా సపోర్ట్ చేస్తోందన్న రాహుల్ పేర్కొన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులపై కూడా అవగాహన కల్పించారు. ఇరాన్ వెనక చైనా, రష్యా ఉందన్న రాహుల్ పేర్కొన్నారు.
మోడీ సరెండర్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మోడీ సరెండర్ అయ్యారని రాహుల్ (Rahul Gandhi) ఆరోపించారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా మోడీ ఏ నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ నేతలకు పలు సూచనలు చేశారు. నాయకులు తమ ఇగోను పక్కనపెట్టి అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు. ప్రతి నేతకు పార్టీ మాత్రమే ముఖ్యమని పార్టీ కోసం పనిచేయాలని సూచించారు.
కష్టపడి పనిచేయండి
నేతలు ఏమీ ఆశించకుండా కష్టపడి పనిచేయాలని కోరారు. మహాత్మాగాంధీకి ఒంటి మీద ఒక గడ్డ తప్ప తనకంటూ ఏమీ లేదని గుర్తు చేశారు. గాంధీ చరిత్ర చెరిపివేయాలని కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బ్రిటిష్ వారే గాంధీని ఏమీ చేయలేకపోయారన్నారు. అటువంటిది నరేంద్ర మోడీ ఏం చేస్తారని ప్రశ్నించారు. దేశంలోని కాంగ్రెస్ క్యాడర్ మొత్తం కష్టపడి పనిచేస్తే అధికారం వస్తుందని పేర్కొన్నారు.
Read Also: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్.. !
Follow Us On: Instagram

