epaper
Monday, March 2, 2026
epaper

ఇరాన్ దాడులు.. యూఏఈ సంచ‌ల‌న నిర్ణ‌యం!

క‌లం, వెబ్ డెస్క్‌: ఇరాన్ చేస్తున్న దాడుల‌పై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఈ దాడుల‌కు నిర‌స‌న‌గా టెహ్రాన్‌లోని తన దౌత్య కార్యాలయాన్ని (Tehran Embassy) మూసివేసింది. అలాగే ఇరాన్‌లో ఉన్న అత్యున్నత దౌత్యాధికారి, దౌత్య మిషన్‌లోని సభ్యులంద‌రినీ తిరిగి వెన‌క్కి తీసుకోనుంది. ఈ మేర‌కు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇటీవల యూఏఈ భూభాగంలోని నివాస ప్రాంతాలు, ఎయిర్‌పోర్ట్‌లు, పోర్ట్‌లు, ఇతర సివిల్ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ రాకెట్ దాడులు చేప‌ట్టింది. ఈ దాడులు సామాన్య‌ పౌరుల భద్రతకు భయంకరమైన ముప్పు కలిగించాయి. మంత్రిత్వ శాఖ దీన్ని జాతీయ సార్వభౌమత్వానికి విరుద్ధమని, అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉల్లంఘన అని పేర్కొంది. ప్రకటనలో యూఏఈ భద్రతకు ముప్పు క‌లిగించే ఏ చ‌ర్య‌ల‌పై అయినా కఠినంగా స్పందిస్తామని వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితులు ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, భద్రత, ఇంధన భద్రత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ముప్పు కలిగిస్తున్నాయని హెచ్చరించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!