కలం, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఇటీవల మిడ్‌ల్ ఈస్ట్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించడానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Netanyahu)తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా యుద్ధంపై భారత్ ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల భద్రతను అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని, త్వరితగగతిన శాంతియుత పరిష్కారానికి నిర్ణయం తీసుకోవాలని మోడీ కోరారు. అలాగే మోడీ యూఏఈ అధ్యక్షుడు, తన సోదరుడైన షేక్ మొహమద్ బిన్ జాయిడ్ అల్ నహ్యాన్‌తో కూడా ఫోన్‌లో మాట్లాడారు. యూఏఈ పై జరిగిన దాడులను మోడీ ఖండించారు. ఈ దాడుల్లో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఇలాంటి కఠిన సమయంలో భారత్ యూఏఈకి అండగా ఉంటుందన్నారు. యూఏఈలో నివసించే భారతీయుల రక్షణ కోసం చూపిన శ్రద్ధకు కృతజ్ఞతలు తెలిపారు. శాంతి, భద్రత, స్థిరత్వం కోసం పరిస్థితులు ఉద్రిక్తం కాకుండా చూడాలని మోడీ సూచించారు.

