epaper
Monday, March 2, 2026
epaper

వాళ్ల‌ను ఇరాన్‌కు పంపేయండి.. నిర‌స‌న‌కారుల‌పై మోడీకి యాంక‌ర్ ర‌ష్మీ రిక్వెస్ట్

క‌లం, వెబ్ డెస్క్‌: జ‌బ‌ర్ద‌స్త్‌తో ఫేమ‌స్ అయిన యాంక‌ర్ ర‌ష్మీ గౌతమ్ (Rashmi Gautam) షోల‌తో పాటు సోష‌ల్ మీడియాలో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఇరాన్‌లో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై యాంక‌ర్ ర‌ష్మీ సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఆమె వ్యాఖ్య‌ల‌కు ప‌లువురు కౌంట‌ర్లు కూడా ఇచ్చారు. తిరిగి వారి కౌంట‌ర్ల‌కు ర‌ష్మీ కూడా ఘాటు స్పందించింది. ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీ మృతితో భార‌త్‌లో జ‌రుగుతున్న నిర‌స‌న‌ల‌పై యాంక‌ర్ ర‌ష్మీ ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేసింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ(PM Modi)ని ట్యాగ్ చేస్తూ నిర‌స‌న చేస్తున్న వాళ్లంద‌రినీ ఇరాన్‌కు పంపించేయాల‌ని కోరింది. అప్పుడు వాళ్లంతా వారి ప్ర‌జ‌ల‌తోనే అక్క‌డ పోరాడ‌తార‌ని సెటైర్లు వేసింది. ఇంత‌టితో ఆగ‌కుండా ర‌ష్మీ (Rashmi Gautam) వ‌రుస పోస్టులు పెడుతూ రిప్లైల‌కు కౌంట‌ర్ ఇచ్చింది.

ఒక నెటిజ‌న్ త‌న పోస్టుకు స్పందిస్తూ ఇలా మాట్లాడ‌టం స‌రికాద‌ని రిప్లై ఇచ్చాడు. నా ఫీడ్‌లో నాకు ఏది క‌రెక్ట్ అనిపిస్తే అది మాట్లాడితే.. నీకు న‌చ్చ‌క‌పోతే అది నీ ప్రాబ్లెం అంటూ ర‌ష్మీ ఘాటుగా స్పందించింది. అలాగే ఓ మ‌హిళ మాట్లాడిన‌ వీడియోను ర‌ష్మీ షేర్ చేసింది. వీడియోలో స‌ద‌రు మ‌హిళ ఖ‌మేనీ సింహంలాంటి వ్య‌క్తి అని, అత‌డిని దొంగ‌దెబ్బ తీసి చంపేశార‌ని పేర్కొంది. త‌న పిల్ల‌ను త్యాగం కోసం సిద్ధం చేశానంటూ ఎమోష‌న‌ల్‌గా మాట్లాడింది. ఈ వీడియోను షేర్ చేసిన ర‌ష్మీ… ‘ఆ ఆంటీని వెంటనే ఆమె పెంచిన కుమారులతో కలిసి ఇరాన్‌కు పంపించండి, త్యాగం కోసం సిద్ధం చేసిందట కదా… ఇలాంటి మనస్తత్వాన్ని మూలంలోనే అణచివేయాలి’ అని పేర్కొంది.

ఇస్లామిక్ పాలన కింద జీవించడం ఎంత భయంకరంగా ఉంటుందో చూడాలంటూ ఓ ఇరాన్ మహిళ చెప్పిన వీడియోను షేర్ చేసింది. స‌ద‌రు వీడియోలో ఆ మ‌హిళ ఇరానీయ‌న్ల ప‌రిస్థితి ఎలా ఉంటుందో చూడాలంటే ఇరాన్‌కు వెళ్లి అక్కడి పాలనలో జీవించాల‌ని, అక్క‌డ‌ ఒక పిల్లవాడిని పెంచి చూడాల‌ని, ఆ తర్వాత దాని గురించి మాట్లాడుకుందామ‌ని చెప్పింది. దీనిపై ర‌ష్మీ స్పందిస్తూ ఇలాంటి మనస్తత్వం మా దేశంలో మాకు అస్సలు వద్దు అంటూ పోస్ట్ చేసింది.

తెలుగువాళ్లు కూడా నీకు ఇలా చెప్పి ఉండి ఉంటే, నువ్వు ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో ఉండే దానికి కాదంటూ శెట్టి పేరుతో ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. వారు షియా ముస్లింలు అని, వారి మత గురువు మరణించార‌న్న దుఃఖంలో ఉన్నార‌ని చెప్పాడు. నీకు కుక్కలు ఏడిస్తే కనిపిస్తాయి కానీ మనుషులు ఏడిస్తే కనిపించరా? అని ప్ర‌శ్నించాడు. దీనికి ర‌ష్మీ స్పందిస్తూ… ‘వావ్… నకిలీ శెట్టి లాగా అనిపిస్తోంది. నా ‘I’ అంటే INDIA నీ ‘I’ అంటే IRAN అదే తేడా. నేను ఏ రాష్ట్రానికి చెందినా ముందు భారతీయురాలినే’ అంటూ రిప్లై ఇచ్చింది.

ఇంకో నెటిజ‌న్ వాళ్లు భారతీయ ముస్లింలు అని, దేశంలో వారికి మాట్లాడే స్వేచ్ఛ ఉంద‌ని, నువ్వు బంగ్లాదేశ్ హిందువుల గురించి, పాకిస్తాన్ హిందువుల గురించి మాట్లాడగలిగితే, వాళ్లు ఇరాన్ గురించి మాట్లాడవచ్చు క‌దా అని ప్ర‌శ్నించాడు. షియాలు ఖమేనీని తమ ప్రస్తుత ఇమామ్‌గా భావిస్తార‌ని, అది ఒక ఆధ్యాత్మిక విషయం అని, ర‌ష్మీ సైలెంట్‌గా ఉండాల‌ని చెప్పాడు. దీనికి ర‌ష్మీ నేను సైలెంట్‌గా ఉండ‌ను, ఏం చేస్తావ్ నువ్వు అంటూ క్వ‌శ్చ‌న్ చేసింది.

ప‌హ‌ల్గామ్ బాధితుల కోసం ఎవ్వ‌రూ రోడ్లెక్క‌లేదు కానీ ఇప్పుడు ఖ‌మేనీ చ‌నిపోతే రోడ్ల‌పైకి వ‌చ్చి ఏడుస్తున్నార‌ని ఓ పోస్టు చేసింది.

యుద్ధాన్ని ఫస్ట్ చాయిస్‌గా ఎంపిక చేసుకోవ‌డం క‌రెక్ట్ కాద‌ని ర‌ష్మీ అభిప్రాయ‌ప‌డింది. ఇలాంటి సందర్భాల్లో త‌న‌ దేశాన్ని తాను పూర్తిగా గౌరవిస్తాన‌ని పేర్కొంది. భార‌త్‌ను ఉద్దేశిస్తూ దేశంపై దాడులు జ‌రిగితే త‌ప్ప ఎప్పుడూ ఎదురుదాడులు చేయ‌లేద‌ని పేర్కొంది. యుద్ధం ఎల్లప్పుడూ నష్టమే మిగులుస్తుంద‌ని చెప్పింది. అది ఏ దేశంలో జరుగుతున్నా, అభివృద్ధిని ఏళ్ల‌పాటు వెన‌క్కి నెడుతుంద‌ని చెప్పింది. యుద్ధాల‌తో చాలా నష్టం జరుగుతుంద‌ని, రాజకీయ లేదా మతపరమైన అంశాల‌కు ఏ సంబంధం లేని జీవితాలు బుగ్గిపాల‌వుతాయ‌ని పేర్కొంది. దురదృష్టవశాత్తూ మనం యుద్ధాలు ఆప‌లేని ప్రపంచంలో జీవిస్తున్నామ‌ని చెప్పింది. మన దేశాన్ని రక్షించుకోవలసిన పరిస్థితి వస్తే మ‌నం ఏదైనా చేయాల‌ని సూచించింది.

ర‌ష్మీ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తుందంటూ ఓ నెటిజ‌న్ రిప్లై ఇచ్చాడు. ఇరాన్ భారతానికి మిత్ర దేశమ‌ని, యుద్ధం ఇరాన్, యూఎస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతోంద‌ని, ఇలాంటి వ్యాఖ్య‌లు చేసేముందు చ‌దువుకోవాల‌ని సూచించాడు. దీనికి ర‌ష్మీ స్పందిస్తూ ఇక్క‌డ ఇరాన్‌కు ఎవ్వరూ వ్యతిరేకంగా లేర‌ని చెప్పింది. కానీ, ఇరాన్‌లో ఉన్న ఫ్యానాటిక్ వ్యక్తులకు, ఇరాన్‌లో టెరరిస్ట్ గ్రూపులను మద్దతు ఇచ్చేవారికి, ఇతరుల సంస్కృతి, నమ్మకాలను నాశనం చేయడం, ధ్వంసం చేయడం మాత్రమే మార్గమని భావించే వారికి వ్యతిరేకంగా ఉన్నామంటూ చెప్పుకొచ్చింది. ఇంకో నెటిజ‌న్ మేం మాన‌వ‌త్వానికి అండ‌గా నిలుస్తామ‌ని, నీలాంటి చెత్త షోల‌కు కాద‌ని చెప్ప‌గా నా షోలు చూస్తున్నందుకు థ్యాంక్స్ అని రిప్లై ఇచ్చింది.

ఓ నెటిజ‌న్ ఈటీవీ ఛానెళ్ల‌ను ట్యాగ్ చేస్తూ ర‌ష్మీ జీతం పెంచాల్సిందే, లేదంటే ఆమె కుటుంబం కోసం ఇలాంటి అశ్లీలమైన కార్యకలాపాల‌కు పాల్ప‌డుతుంద‌ని ఘాటుగా రిప్లై ఇచ్చాడు. దీనిపై రష్మీ స్పందిస్తూ…

మన దేశంలో ఓ భయంకరమైన ఘటనకు కొంతమంది సహకరించిన నిజాన్ని మనం ఎందుకు మర్చిపోతున్నాం? అని పహల్గామ్ ఘటను గుర్తు చేసింది. ప్యాంట్లు విప్పి మత గుర్తులను పరిశీలించారని, వాళ్లు అందరూ పర్యాటకులని చెప్పింది. రేపు భారత్‌కు ఇరాన్‌తో యుద్ధంలో జ‌రిగితే ఆ వ్యక్తులు ఎవరి పక్కన ఉంటారో మనం ఊహించగలమ‌ని తెలిపింది.

హైడ్రా హిందూ ఇళ్లు ధ్వంస చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు? అని ఓ నెటిజ‌న్ ప్ర‌శ్నించాడు. ఇటీవ‌ల ఖమ్మం‌లో కూడా ఇదే జరిగింద‌ని చెప్పాడు. దీనికి ర‌ష్మీ స్పందిస్తూ… నేను ఒక అవకాశవాదిని అని, సంతోషంగా ఉన్నాన‌ని చెప్పింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!