epaper
Sunday, March 1, 2026
epaper

అదంతా ఉత్తదే.. రాజమౌళి సినిమాల సెంటిమెంట్‌పై నిఖిల్

కలం, డెస్క్ : రాజమౌళి సినిమాల తర్వాత హీరోలకు వరుస ప్లాపులు వస్తాయి అనే టాక్ఎప్పటి నుంచో ఉంది. చాలా మంది హీరోలకు రాజమౌళి మూవీ తర్వాత ప్లాపులు రావడంతో ఈ ప్రచారం మొదలైంది. జక్కన్న సినిమాలతో పాన్ ఇండియా స్టార్ స్టేటస్ రావడం పక్కా. కానీ ఆయన సినిమాల తర్వాత ప్లాపులు రావడం కూడా పక్కా అంటున్నారు కొందరు నెటిజన్లు. ఈ విషయంపై తాజాగా హీరో నిఖిల్ (Nikhil) ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న నిఖిల్ (Nikhil) తాజాగా మాట్లాడుతూ.. ‘నేను మూఢ విశ్వాసాలను అస్సలు నమ్మను. రాజమౌళి సినిమాలపై వస్తున్న ప్రచారం అంతా ఉత్తదే. రాజమౌళి తన సినిమాల్లో హీరోలను అత్యద్భుతంగా చూపిస్తారు. ఆ రేంజ్ లో చూపించిన తర్వాత ప్రేక్షకులు తమ హీరోలను అంతకంటే ఏ మాత్రం తక్కువ చూపించినా ఊరుకోరు. అది కొన్ని సినిమాల్లో జరిగినప్పుడు ప్రేక్షకులు ఒప్పుకోక అవి తక్కువ వసూళ్లు రాబడుతాయి. కానీ ఆ తర్వాత మంచి సినిమాలు పడితే కచ్చితంగా హిట్లు వస్తాయి. ప్రభాస్ అన్న కల్కి వెయ్యి కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత సలార్ కూడా పెద్ద హిట్. ఎన్టీఆర్ అన్న దేవర మూవీ భారీ హిట్ అయింది. ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి. అంతే తప్ప అనవసర ప్రచారాలు మంచివి కావు. ప్రతి నటుడు ఒక్కసారైనా రాజమౌళి సినిమాల్లో చేయాలని అనుకుంటారు’ అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!