కలం, డెస్క్ : అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 48 మంది ఇరాన్ నేతలు చనిపోయారంటూ ప్రకటించారు. ఇరాన్ ప్రతి దాడులు ఆపకపోతే మరింత బలంగా దాడులు జరుపుతామని ట్రంప్ (Donald Trump) హెచ్చరించారు. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలపై ఆందోళన వద్దని.. ఏది కరెక్ట్ అయితే అదే చేస్తున్నట్టు తెలిపారు ట్రంప్. తనతో మాట్లాడాలని ఇరాన్ నేతలు కోరుకుంటున్నారని.. వారితో చర్చలకు తాను సిద్ధమని ప్రకటించారు ట్రంప్. ఇరాన్ ఈ పని ముందే చేసి ఉండాల్సిందని.. ఆలస్యం చేశారన్నారు ట్రంప్.

