కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) నుంచి నిష్క్రమణ తర్వాత శ్రీలంక జట్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని సనత్ జయసూర్య (Sanath Jayasuriya) నిర్ణయించుకున్నారు. ఈ టోర్నమెంట్ తర్వాత బాధ్యతలు వదిలేయాలని ముందుగానే భావించినట్లు చెప్పారు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి తర్వాత శ్రీలంక ప్రయాణం ముగిసింది. ఆ మ్యాచ్ పల్లెకెలే స్టేడియంలో జరిగింది. అదే తన చివరి టోర్నమెంట్ అవుతుందని ముందే నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
ఈ నిర్ణయాన్ని ఇంకా అధికారికంగా బోర్డుకు తెలియజేయలేదని తెలిపారు. తన ఒప్పందం జూన్ వరకు కొనసాగుతుందని, బోర్డుతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటానని జయసూర్య (Sanath Jayasuriya) చెప్పారు. కోచ్‌గా ఉన్న కాలంలో జట్టు కొన్ని మంచి విజయాలు సాధించింది. కానీ ఇటీవల టీ20ల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొత్త కోచ్‌పై బోర్డు త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Read Also: ఐటీ ఉద్యోగుల్లో లే ఆఫ్స్ భయం.. అసలు రియాలిటీ ఏంటి?
Follow Us On: X(Twitter)

