కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ (Warangal)లో ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రయోగించిన రుద్రమ-1 రాకెట్ ప్రయోగం ప్రారంభ దశలోనే విఫలమైంది. జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా శనివారం సాయంత్రం భద్రకాళి బండ్ వద్ద ప్రయోగించిన రుద్రమ-1 బుల్లి రాకెట్ వంద అడుగుల దూరం కూడా పైకి వెళ్లకుండా కింద పడింది. రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు వేలాదిగా వచ్చిన విద్యార్థులు (Students), ప్రముఖులు నిరాశతో వెనుదిరిగారు. రాకెట్ ప్రయోగ నేపథ్యంలో సుమారు రూ. 30 లక్షలు వృథా అయ్యాయని పలువురు విమర్శించారు.

