కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో యుద్ధం అమాయకుల ప్రాణాలను బలి తీసుకోవడం మొదలుపెట్టింది. శనివారం ఇరాన్‌పై (Iran – Minab) ఇజ్రాయెల్–అమెరికా దళాలు చేసిన దాడిలో 40 మంది మృతి చెందారు. వీళ్లలో విద్యార్థినులు 36 మంది ఉన్నారు. ఇరాన్ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. మినాబ్ సిటీలో ఉన్న ఐఆర్జీసీ సైనిక స్థావరం లక్ష్యంగా ఇజ్రాయెల్–యూఎస్ (Israel – US) ఈ ఉదయం ఎయిర్‌స్ట్రైక్స్ చేశాయి. అయితే, అవి ప్రయోగించిన బాంబులు గురి తప్పి ఓ ప్రాథమిక పాఠశాలపై పడ్డాయి. దీంతో 24 మంది చిన్నారులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరికొందరు చికిత్స పొందుతూ మరణించారు.
గాయపడినవాళ్లను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలంలో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి(Iran – Minab). దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ఓ సందేశం విడుదల చేశారు. ఇరానీయులు తమ విధిరాతను మార్చుకునే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. 1979 నుంచి సాగుతున్న ఇస్లామిక్ నాయకత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పాలని, ఎదురించాలని పిలుపునిచ్చారు.
Read Also: ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలి : గరికిపాటి నరసింహారావు
Follow Us On: X(Twitter)

