కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియా అట్టుడుకుతోంది. దాడులు, ప్రతిదాడులతో యుద్ధం తీవ్రమవుతోంది. ఇరాన్‌పై(Iran) శనివారం ఉదయం ఇజ్రాయెల్, అమెరికా దాడికి దిగడంతో మొదలైన ఘర్షణలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. తెల్లవారుజామున తమపై జరిగిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ సైతం ప్రతిదాడులకు దిగింది. ఇజ్రాయెల్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. మరోవైపు అమెరికా స్థావరాలున్న దోహా, అబుదాబి, బహ్రెయిన్లోనూ పేలుళ్లు చోటుచేసుకున్నాయి.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఉదయం భారీ పేలుళ్లు జరిగాయి. అనంతరం తాము దాడి ప్రారంభించినట్లు స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు US Israel Attack. అంతేకాదు, ఇరాన్ లొంగిపోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు దాడుల విషయాన్ని ధ్రువీకరించిన ఇరాన్.. ఆస్తి, ప్రాణ నష్ట వివరాలను వెల్లడించలేదు. అయితే, టెహ్రాన్‌లోని చాలా ప్రాంతాల్లో దట్టమైన పొగలు వెలువడుతున్న ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అధ్యక్షుడు అయతొల్లా ఖొమేనీ నివాసానికి సమీపంలోనూ బాంబు దాడులు జరగ్గా, ఆ సమయంలో ఆయన అక్కడ లేరని ఇరాన్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఇరాన్‌లోని చాలా సిటీలకు దాడులు విస్తరించాయి.
గల్ఫ్ కంట్రీస్పైకి ఇరాన్ మిస్సైళ్లు..
తమపై దాడికి ప్రతీకారంగా ఇరాన్(Iran) మిస్సైళ్లతో గల్ఫ్ కంట్రీస్ మీద విరుచుపడుతోంది. బహ్రెయిన్, ఖతార్, కువైట్, యూఏఈలోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా మిస్సైళ్లు, డ్రోన్లతో దాడి చేసింది. దీంతో దోహా, మనామా, అబుదాబి, కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాల్లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. మనామాలోని యూఎస్ నేవల్ బేస్‌పై ఇరాన్ మిస్సైల్ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. పేలుళ్ల కారణంగా ప్రజలు భయంతో వీధుల వెంట పరుగులు తీస్తున్న వీడియోలు వైరలవుతున్నాయి. మరోవైపు ఇరాన్ దాడుల తీవ్రతను తెలిపేలా, ఇజ్రాయిల్ తమ దేశ మ్యాప్‌ను రెడ్ కలర్లోకి మార్చింది.
- దాడుల కారణంగా ఖతార్, యూఏఈ, కువైట్ తమ ఎయిర్‌స్పేస్‌లను మూసివేశాయి. దీంతో అక్కడికి రాకపోకలు సాగించే పలు విమానాలు రద్దయ్యాయి.
- ఇప్పటికే ఇజ్రాయెల్, ఇరాన్‌లోని భారత పౌరులకు అడ్వైజరీ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఖతార్‌లోని ఇండియన్లకూ అడ్వైజరీ ఇచ్చింది.
- గల్ఫ్ కంట్రీస్‌కు భారత్ నుంచి బయలుదేరిన విమానాలు అక్కడి పరిస్థితి కారణంగా వెనక్కు వచ్చాయి.
Read Also: వేట్లపాలెం పేలుడు ఘటనలో 20 మంది దుర్మరణం
Follow Us On: Instagram

