epaper
Monday, March 2, 2026
epaper

డీజీపీ ఆఫీసు ముట్టడికి అయ్యప్ప స్వాముల యత్నం..

తెలంగాణ డీజీపీ కార్యాలయం(DGP Office) దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అయ్యప్ప దీక్షలో ఉన్న పోలీసు సిబ్బంది యూనిఫాంతో పాటు మాల ధరించడానికి వీలులేదని తాజాగా ఆంక్షలు పెట్టారు. ఈ ఆంక్షలపై అయ్యమ దీక్ష తీసుకున్న అయ్యప్ప స్వాములు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అయ్యప్ప మాల ధరించిన స్వాములు, బీజేవైఎం కార్యకర్తలు కలిసి కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

DGP Office | తాజాగా తీసుకొచ్చిన నిబంధనలు “హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి” అని వారు ఆరోపించారు. అయ్యప్ప స్వాములు ముట్టడిని అడ్డుకునేందుకు పోలీసులు ముందుకు రావడంతో స్వాములు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగానే పోలీసుల్లో అయ్యప్ప మాల ధారణను ఆపడం అన్యాయం దీక్ష తీసుకున్న అయ్యప్ప భక్తులు వ్యతిరేకించారు. మతాచారాలకు విఘాతం కలిగించే ఆంక్షలను వెంటనే ఉపసంహరించాలి అని డిమాండ్ చేశారు.

Read Also: గ్రూప్ 2 నియామకాలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!