epaper
Sunday, March 1, 2026
epaper

తిరుపతి ప్రసాదంపై అడివి శేష్ కామెంట్స్!

క‌లం, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ డైరెక్ట‌ర్ న‌టుడు అడివి శేష్ (Adivi Sesh) నేడు తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకున్నారు. అడివి శేష్‌, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంట‌గా న‌టించిన డెకాయిట్ (Dacoit) మూవీ ఏప్రిల్ 10న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా మూవీ టీం ఈ రోజు ఆల‌యంలో స్వామిని ద‌ర్శించుకొని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. షానీల్ డియో ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమా ద్విభాషా చిత్రంగా తెర‌కెక్కుతోంది. ద‌ర్శ‌నం అనంత‌రం మూవీ టీం మీడియాతో మాట్లాడారు.

మొదటిసారిగా స్వామివారి దర్శనానికి వచ్చాన‌ని, ‘డెకాయిట్’ (Dacoit) సినిమా ప్రేక్షకుల ఆద‌ర‌ణ‌ పొందాలని ప్రార్థించాన‌ని మృణాల్ తెలిపారు. ప్ర‌తి ఏటా తిరుమ‌ల‌కు (Tirumala) రావాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పారు. ఇక అడివి శేష్ మాట్లాడుతూ.. నిన్న ఐఐటీ తిరుప‌తిలో పాట లాంచ్ చేయ‌డానికి వ‌చ్చామ‌ని తెలిపారు. స్వామి వారి ప్ర‌సాదం చాలా బాగుంద‌ని చెప్తూ న‌వ్వేశారు. హీరోయిన్ మృణాల్ కూడా ప్ర‌సాదం చాలా టేస్టీగా ఉంద‌న్నారు. ఇటీవ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం చుట్టూ రాజ‌కీయాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో అడివి శేష్ (Adivi Sesh) ప్ర‌త్యేకంగా ప్ర‌సాదం గురించి మాట్లాడ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

Read Also: రణబాలి విడుద‌ల తేదీ ప్ర‌క‌టించిన మేక‌ర్స్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!