కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ సూపర్–8లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ (New Zealand) బ్యాటర్లు శక్తివంచన లేకుండా పోరాడారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి, ఇంగ్లండ్ ముందు 160 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టిమ్ సీఫర్ట్ 35 పరుగులు చేశాడు. ఫిన్ అలెన్ 29 పరుగులు జోడించాడు. రచిన్ రవీంద్ర 11 పరుగులు, మార్క్ చాప్మన్ 15 పరుగులు చేశారు. చివర్లో మిచెల్ సాంట్నర్ నాటౌట్‌గా నిలిచాడు.
ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, విల్ జాక్స్, రేహాన్ అహ్మద్ తలో రెండు వికెట్లు తీశారు. లియామ్ డాసన్ ఒక వికెట్ సాధించాడు. మొత్తంగా కివీస్ (New Zealand)159 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ విజయానికి 160 పరుగులు అవసరం.

