epaper
Sunday, March 1, 2026
epaper

పిల్లల డేటా జాగ్రత్త.. రాష్ట్రాలకు ఎన్​హెచ్​ఆర్​సీ అలెర్ట్​

కలం, వెబ్​ డెస్క్​: నేషనల్ హ్యూమన్​ రైట్స్​ కమిషన్​(NHRC) శుక్రవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కొన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాలకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. పిల్లల ప్రైవసీ గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ, వారి డేటా భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో సంచలనం సృష్టిస్తున్న ఆంథ్రోపిక్​ సంస్థతో చిన్నారుల సంక్షేమం కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ(ఎన్​జీవో) ‘ప్రథమ్’​ ఇటీవల టైఅప్​ అయిన సంగతి తెలిసిందే. చిన్నపిల్లల చేతిరాతను వీళ్లు ఎనీటైమ్​ టెస్టింగ్​ మెషిన్​ (Anytime Testing Machine – ATM) అనే ఏఐ వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తూ, వాళ్ల అకడమిక్​ డేటాను ప్రాసెస్​ చేస్తున్నారు. దీనిపై అభ్యంతరం, ఆందోళన వ్యక్తం చేస్తూ ఎన్​హెచ్​ఆర్​సీకి ఫిర్యాదు అందింది.

ఇలా సేకరించిన చిన్నారుల వ్యక్తిగత డేటా, ప్రాసెసింగ్​, స్టోరేజ్​ సరిహద్దులు దాటితే అది పిల్లల గోప్యతకు ప్రమాదంగా మారొచ్చని పిటిషన్​దారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిని శత్రువులు, సైబర్​ నేరగాళ్లు వాడుకునే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తగినంత రక్షణ చర్యలు లేనందున భద్రత సమస్యలు ఎదురుకావొచ్చని పేర్కొన్నారు. ఎన్​హెచ్​ఆర్​సీ దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ ఫిర్యాదును, అందులో ప్రస్తావించిన అంశాలను ఎన్​హెచ్​ఆర్​సీ (NHRC) పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు, యూనియన్​ టెరిటరీస్​కు, సెంట్రల్​ డిపార్ట్​మెంట్స్​కు, మినిస్ట్రీస్​కు లేఖ రాసింది. పిల్లల డేటా భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!