epaper
Sunday, March 1, 2026
epaper

భద్రాచలం అన్నదాన సత్రం తనిఖీ

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం(Bhadrachalam) శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అన్నదాన సత్రాన్ని ఆలయ ఈవో దామోదర్ రావు (EO Damodar Rao) శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నప్రసాదం తయారీ విధానం, పంపిణీ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అన్నదాన సత్రంలో పరిశుభ్రత, ఆహార నాణ్యత విషయంలో సిబ్బందికి పలు సూచనలు చేశారు.

అన్నప్రసాదానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమర్థవంతంగా సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. అన్నప్రసాదం స్వీకరిస్తున్న భక్తులతో మాట్లాడిన ఈవో, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అన్నప్రసాదం రుచి, నాణ్యతపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు కొనసాగిస్తామని ఆలయ ఈవో దామోదర్ రావు (EO Damodar Rao) ఈ సందర్భంగా భక్తులకు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!