epaper
Monday, March 2, 2026
epaper

చిలుకూరి బాలాజీ టెంపుల్​ ప్రధానార్చకుల ఇంట విషాదం

కలం, వెబ్​ డెస్క్​: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​ మండలం చిలుకూరిలోని బాలాజీ దేవాలయం (Chilkur Balaji Temple) ప్రధానార్చకులు రంగరాజన్​ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, ఆలయ వ్యవస్థాపక ప్రధానార్చకులు సీఎస్​ సౌందరరాజన్(90) పరమపదించారు ​(CS Soundararajan). వృద్ధాప్య సంబంధ అనారోగ్యం కారణంగా కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్న ఆయన శుక్రవారం కన్నుమూశారు. ఈమేరకు ఆయన తనయుడు రంగరాజన్​ వెల్లడించారు.

ఆలయాలకు స్వయంప్రతిపత్తి కావాలని, హుండీలు, వీఐపీ కల్చర్ వద్దని సౌందరరాజన్ (CS Soundararajan)​ పోరాడారు. చిలుకూరు బాలాజీ టెంపుల్​లో అందరికీ సమానంగా స్వామి దర్శనం కల్పించే సంప్రదాయం నెలకొల్పారు. ‘కళ్లు తెరచి స్వామిని చూడండి, కళ్లు మూసుకొని కాదు’ అంటూ ఆయన చెప్పిన మాటలు, భక్తులను ఉద్దేశించి చెప్పే సూక్తులు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ప్రస్తుత ప్రధానార్చకులైన రంగరాజన్​ సైతం తన తండ్రి బాటనే ఆచరిస్తూ, ఆదర్శంగా నిలుస్తున్నారు.

కాగా, హైదరాబాద్​ మహానగరానికి సమీపంలోని చిలుకూరులో ఉన్న బాలాజీ ఆలయం వీసా టెంపుల్​గా ప్రసిద్ధి. విదేశాల్లో.. ముఖ్యంగా అమెరికాలోని యూనివర్సిటీల్లో ఉన్నతవిద్య అభ్యసించేందుకు దరఖాస్తు చేసుకున్న మన విద్యార్థులు.. వీసా రావాలని కోరుకుంటూ ఈ ఆలయానికి వచ్చి మొక్కుకుంటారు. అందువల్ల ఈ ఆలయం వీసా టెంపుల్​గా, ఇందులోని స్వామి వీసాల దేవుడిగా ప్రసిద్ధి చెందారు.

Read Also : లిక్కర్ క్వీన్ TO క్లీన్ క్వీన్ : కవిత పొలిటికల్ గేమ్ చేంజ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!