epaper
Sunday, March 1, 2026
epaper

లిక్క‌ర్ కేసుపై ఢిల్లీ హైకోర్టుకు సీబీఐ

క‌లం, వెబ్ డెస్క్‌: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు (Delhi Liquor Policy Case)లో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అర్వింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా స‌హా 23 మందిని డిశ్చార్జ్ చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని సీబీఐ నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)ను ఆశ్రయించనున్నట్లు సీబీఐ వర్గాలు వెల్ల‌డించాయి. సీబీఐ చార్జ్ షీట్‌లో ఆరోప‌ణ‌ల‌కు స‌రైన ఆధారాలు లేవ‌ని పేర్కొంటూ రౌస్ అవెన్యూ కోర్టు ఈ రోజు ఉద‌యం తీర్పు వెలువ‌రించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న‌ 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది. వీరిలో అర్వింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, క‌ల్వ‌కుంట్ల‌ కవిత, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామ్‌చంద్ర పిళ్లై, సమీర్ మహేంద్రు, అమన్‌దీప్ సింగ్ ఢాల్ తదితరులు ఉన్నారు.

Read Also : కడిగిన ముత్యంలా బయటకువచ్చా: కల్వకుంట్ల కవిత

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!