కలం, వెబ్ డెస్క్: వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్నత స్థాయి ఇంజనీరింగ్ ఉద్యోగాలకు కీలకమైన ఇంజనీరింగ్ సర్వీసెస్(ఈఎస్ఈ/ఐఈఎస్) ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ విడుదలయ్యాయి(UPSC ESE 2026). ఈ నెల 8న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) గురువారం విడుదల చేసింది. అభ్యర్థుల పేర్లు, రోల్ నెంబర్లతో కూడిన వివరాలను వెబ్సైట్లో ఉంచింది. ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షను జూన్ 21న నిర్వహించనుంది. దీనికి వారం ముందు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని ప్రకటించింది. వీటి ఫలితాలు వచ్చిన తర్వాతే ప్రిలిమినరీలో సాధించిన మార్కుల వివరాలు వెల్లడించనున్నట్లు పేర్కొంది. కేంద్ర రైల్వే, రక్షణ, విద్యుత్, టెలికాం రంగాల్లో క్లాస్ ఎ, క్లాస్ బి గెజిటెడ్ ఉద్యోగాల కోసం ఈ ఎగ్జామ్స్కు ఎంతో కీలకం. దీనికోసం ఏటా ఎంతో మంది ఇంజనీరింగ్ విద్యార్థులు పోటీ పడుతుంటారు. పరీక్ష ఫలితాలు, మరిన్ని వివరాలకు https://upsc.gov.in/ వెబ్సైట్లో చూడవచ్చు.

