epaper
Sunday, March 1, 2026
epaper

రాజేష్‌ను అన్యాయంగా చంపేశారు : కేటీఆర్

కలం, నల్లగొండ బ్యూరో : దళిత యువకుడు రాజేష్‌ను రాజకీయ ఒత్తిళ్లతో చిత్రహింసలు పెట్టి అన్యాయంగా చంపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఇటీవల లాకప్ డెత్‌లో మృతిచెందిన కర్ల రాజేశ్ కుటుంబాన్ని గురువారం కేటీఆర్ పరామర్శించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలే రాజేష్‌ను బలి తీసుకున్నారన్నారు. కాంగ్రెస్ లీడర్లు, స్థానిక ఎమ్మెల్యే పద్మావతి, మంత్రి ఉత్తమ్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పోలీసు అధికారులను ఇంకా ఎందుకు కాపాడుతున్నారని, డీఎస్పీ శ్రీధర్ రెడ్డికి ప్రమోషన్ ఇచ్చి మరీ మంత్రి ఉత్తమ్ తన వద్దే ఉంచుకున్నారని కేటీఆర్ (KTR) మండిపడ్డారు. ఇది చాలా అన్యాయమని.. రాజేష్ తల్లి క్షోభను ఎవ్వరూ తీర్చలేరని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీలోనూ ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ఢిల్లీ దాకా కొట్లాడుతామని చెప్పారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరపున రూ.5 లక్షలు ఆర్థిక సాయాన్ని ఇస్తామని, అన్నివిధాలా అండగా ఉంటామని తెలిపారు. ఏ కష్టం వచ్చినా మేం ఉన్నామని, ఆ కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలని, ఈ పోరాటంలో మందకృష్ణ పోరాటం అభినందనీయమని కేటీఆర్ కొనియాడారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!