కలం, డెస్క్ : విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్ ఇది. తాజాగా ఫ్లైట్ టికెట్ (Flight Tickets) రీఫండ్ రూల్స్ ను తాజాగా డీజీసీఏ సవరించింది. ఏ కంపెనీకి చెందిన ఫ్లైట్ టికెట్ అయినా సరే బుక్ చేసుకున్న 48 గంటల్లోపు క్యాన్సల్ చేస్తే అడిషనల్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని డీజీసీఏ ప్రకటించింది. అలాగే టికెట్ లో మార్పులకు కూడా ఎలాంటి ఛార్జీలు లేకుండా ఫ్రీగా చేసుకోవచ్చని డీజీసీఏ వివరించింది. కాకపోతే ఇక్కడ కొన్ని కండీషన్లు ఉంటాయని వివరించింది.
ఏదైనా టికెట్ సదరు కస్టమర్ బుక్ చేసుకున్న 48 గంటల పాటు ఆ కంపెనీ ‘లుక్ ఇన్ ఆప్షన్’ ఇవ్వాలి. ఇలాంటి ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఆ కస్టమర్ 48 గంటల్లోపు టికెట్ క్యాన్సల్ చేసుకున్నా సరే స్పెషల్ ఛార్జీలు ఉండవు. అలాగే టికెట్ ను ఎడిట్ చేసుకున్నప్పుడు కొత్త డేట్ లో ఎక్కువ ధర ఉంటే ఆ ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఆ కంపెనీల పోర్టల్ లేదా వెబ్ సైట్ ద్వారా కస్టమర్లు టికెట్లు బుక్ చేసుకుంటే.. రీఫండ్ చేయాల్సిన బాధ్యత కచ్చితంగా ఆయా కంపెనీలదే అని డీజీసీఏ స్పష్టం చేసింది. 14 వర్కింగ్ డేస్ లో రీఫండ్ కచ్చితంగా చేయాలని.. లేదంటే చట్టపరమైన చర్యలు ఉంటాయని డీజీసీఏ వెల్లడించింది.
ఇక్కడ దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో కొన్ని తేడాలు ఉంటాయి. దేశీయ ఫ్లైట్ టికెట్ లో (Flight Tickets) వారం రోజుల ముందు బుక్ చేసుకునే టికెట్లకు ఈ లుక్ ఇన్ ఆప్షన్ ఉండదు. అలాగే అంతర్జాతీయ ఫ్లైట్ టికెట్లను 15 రోజుల ముందే బుక్ చేసుకుంటే ఈ లుక్ ఇన్ ఆప్షన్ ఇవ్వవు కంపెనీలు. అలాగే జర్నీ ఉన్న రోజే సదరు ప్రయాణికుడికి లేదా అతని కుటుంబంలో ఎవరికైనా హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే టికెట్ క్యాన్సల్ చేసుకుంటే కచ్చితంగా రీఫండ్ చేయాలి.

