కలం, డెస్క్ : డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) ప్రస్తుతం తమిళ హీరో విజయ్ సేతుపతితో (Vijay Sethupathi) బెగ్గర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైమ్ పూరీ తన మూవీ స్టైల్ ను పక్కన పెట్ట డిఫరెంట్ కథతో చేస్తున్నాడు. వరుస ప్లాపులతో ఉన్న పూరీకి ఈ మూవీ కచ్చితంగా హిట్ కావాల్సిందేనని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పటికే తెలుగులో స్టార్ హీరోలు పూరీతో మూవీ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదనే ప్రచారం ఉంది. ఇలాంటి తరుణంలో పూరీ జగన్నాథ్ తన తర్వాత సినిమాను మరో స్టార్ హీరోతో చేస్తున్నట్టు తెలుస్తోంది.
తమిళ స్టార్ హీరో సూర్యకు ఇప్పటికే ఓ ఇంట్రెస్టింగ్ లైన్ వినిపించాడంట. దానికి సూర్య(Suriya) కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇద్దరి మధ్య కథ గురించి చాలా డీప్ డిస్కషన్ నడిచిందని.. అతి త్వరలోనే మూవీ ఫైనల్ కావడం ఖాయం అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. వరుసగా రెండు ప్లాపులు వస్తేనే డైరెక్టర్లకు ఇప్పుడు అవకాశాలు తగ్గిపోతున్నాయి. అలాంటిది పూరీకి (Puri Jagannadh) విజయ్ సేతుపతితో ఇంకా హిట్ పడకముందే సూర్య ఓకే చేయడం అంటే చాలా బెటర్ మ్యాటర్. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు గానీ.. నిజమయితే మాత్రం పూరీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.
Read Also : డైరెక్టర్ వి.వి. వినాయక్‌ని కలిసిన ప్రభాస్
Follow Us On: Sharechat

