కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల (Velugumatla)లో భూదాన్ భూముల్లో పేదల ఇండ్ల కూల్చివేత వ్యవహరం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనను బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తీవ్రంగా ఖండిస్తూ బాధితులకు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) గురువారం వెలుగుమట్ల బాధితులను పరామర్శించి వారితో మాట్టాడారు. పేదల ఇండ్లను కూల్చివేయడం దారుణమైన చర్య అని, బాధితుల కోసం తాను సుప్రీం కోర్టుకు కూడా వెళ్లి కోట్లాడతామని భరోసా ఇచ్చారు.
ఇదే స్థలంలో ఇండ్లు కట్టిస్తాం
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ఇదే స్థలంలో ఇల్లు కట్టించి, గృహప్రవేశాలు చేసే బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా స్పందించారని కేటీఆర్ అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూలగొట్టడమా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శత్రుదేశం మీద దండ యాత్రకి పోయినట్లు 4000 మంది పోలీసులతో దాడి చేశారని మండిపడ్డారు.
మంత్రులు తప్పు చేయకపోతే బాధితులతో మాట్లాడాలి
ఖమ్మం (Khammam) జిల్లా మంత్రులు తప్పు చేయకపోతే వచ్చి బాధితులతో మాట్లాడాలని కేటీఆర్ సవాలు విసిరారు. ఇంటి పట్టాలు, కరెంట్ బిల్లులు, ఆస్తి పన్ను, ఇంటి పన్నులను బాధితులు కేటీఆర్‌కు చూపించారు. వెలుగుమట్ల అంశాన్ని అసెంబ్లీ, మండలిలో లేవనెత్తి ప్రభుత్వం పనితీరును ఎండగడతామని కేటీఆర్ (KTR) అన్నారు.
Read Also : రిజర్వాయర్ లోకి దూసుకెళ్లిన్ కారు.. డ్రైవర్ గల్లంతు
Follow Us On: Youtube

