కలం, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా అనురాగ్ జయంతి (Anurag Jayanti) నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్వ కలెక్టర్ హనుమంతరావు దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. దీనితో పాటు గోదావరి పుష్కరాల స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంతి (Anurag Jayanti) తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా యాదాద్రి కలెక్టర్‌గా నియమితులయ్యారు. అంతకుముందు ఆయన జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. అదేవిధంగా శేరిలింగంపల్లి అదనపు కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న వెంకారెడ్డిని యాదాద్రి జిల్లా అదనపు కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

