epaper
Sunday, March 1, 2026
epaper

వాహనదారులకు షాక్ : మార్చి నుండి కొత్త పన్నుల భారం!

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ రాష్ట్రంలో వాహనదారులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ మోటారు వాహనాల పన్ను చట్టం-2026ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అమలు చేయబోతోంది. ఈ మేరకు రవాణా, రహదారులు, భవనాల శాఖ జీవో ఎంఎస్ నంబర్ 10ను జారీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. మార్చి 1వ తేదీ నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త చట్టం ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్, పన్నుల విధానంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి.

ఈ నిబంధన ప్రకారం వాహన రకాన్ని బట్టి వినియోగదారులు 2వేల రూపాయల నుండి గరిష్టంగా 10 వేల రూపాయల వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ పన్నును వసూలు చేయాలని ప్రభుత్వం (Telangana Government) భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రధానంగా కార్లు, ప్రయాణికులను తీసుకెళ్లే ఆటో రిక్షాలు, ఇతర నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలపై ఈ భారం పడనుంది. రహదారి భద్రతను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ కొత్త పన్ను విధింపు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి సుమారు 270 కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరుతుందని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!