Mobile Popup Ad
Mobile Popup Ad

తిరుమల ఘాట్ రోడ్డులో అదుపుతప్పిన బైక్.. యువకుడు మృతి

క‌లం, వెబ్ డెస్క్‌: తిరుమ‌ల‌లో ఘాట్‌ రోడ్డు (Tirumala Ghat Road)లో ఘోర‌ ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఓ బైక‌ర్ అదుపుత‌ప్పి లోయ‌లోప‌డి మృతి చెందాడు. గురువారం ఉద‌యం ఘాట్ రోడ్డులోని 30వ మ‌లుపు వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్తే.. త‌మిళ‌నాడుకు చెందిన న‌ట‌రాజ‌న్‌, మునిర‌త్నం బైక్‌పై తిరుమ‌ల‌కు వ‌చ్చారు. ఘాట్ రోడ్డులో ప్ర‌యాణిస్తుండ‌గా 30వ మ‌లుపు వ‌ద్ద వీరి బైక్ పిట్ట గోడను ఢీకొట్టింది. అక్క‌డి రోడ్డు ప‌క్క‌న లోయ‌లో ప‌డ‌టంతో న‌ట‌రాజ‌న్ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. ఈ ప్ర‌మాదంలో మునిర‌త్నం తీవ్ర గాయాల‌పాల‌య్యాడు. మునిర‌త్నంను తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. అతి వేగం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగింద‌ని ప్రాథ‌మికంగా పోలీసులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>