epaper
Monday, March 2, 2026
epaper

సోషల్ మీడియా బ్యాన్: పిల్లల ఫ్యూచర్ పై ఇండియా అడుగులు ఎటు?

కలం, తెలంగాణ బ్యూరో: ముందట ఫోన్​లో బొమ్మలు పెడ్తే కానీ నోట్లో ముద్ద పెట్టుకోని పసి బాల్యం! పొద్దున లేచింది మొదలు స్కూల్​కు వెళ్లేదాకా.. తిరిగి స్కూల్ నుంచి వచ్చి బెడ్​ ఎక్కేదాకా రీల్స్​, షార్ట్స్​ చూడనిదే.. వాటిలో పోస్టులు పెట్టనిదే గడవని టీనేజ్! ఫలితంగా సహజ ఆటలకు పిల్లలు దూరమవుతున్నారు. తోటివారితో స్నేహాలూ లేవు. అమ్మానాన్నతో, నాన్నమ్మ తాతయ్యతో ముద్దు.. ముచ్చట్లూ ఉండటం లేదు. పైగా.. పొద్దస్తమానం సోషల్ మీడియాలో చిన్నారులు మునిగితేలడంతో వారి మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటున్నది. భవిష్యత్తు మసకబారిపోతున్నది. సోషల్ మీడియా ఉచ్చు నుంచి బాల్యానికి రెక్కలు తొడిగేందుకు చాలా దేశాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కఠిన నిబంధనలు తెస్తున్నాయి. 16 ఏండ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్​ (Social Media Ban) చేస్తున్నాయి.

ఆ దిశగా మొదటి అడుగు ఆస్ట్రేలియాలో (Australia) పడింది. తర్వాత ఫ్రాన్స్​, నార్వే, బ్రిటన్​, స్పెయిన్.. ఇలా వరుస బెట్టి దేశాలు తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం సోషల్​ మీడియాను కట్టడి చేస్తున్నాయి. ఇండియాలో కూడా ఇదే వాదన వినిపిస్తున్నది. దీనిపై ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం కేబినెట్​ సబ్​ కమిటీని వేసింది. కర్నాటక సర్కార్​ ప్రజాభిప్రాయ సేకరణ చేపడ్తున్నది.

ఈ అంశంపై కలం 360 డిగ్రీస్​ స్పెషల్​ స్టోరీ చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి.

Social Media Ban
Social Media Ban

Read Also: ఆపరేషన్ కగార్‌ : దేశంలోనే చారిత్రాత్మక ఘట్టం.. మోదీ సంచలన ప్రకటన

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!