epaper
Monday, March 2, 2026
epaper

15 నిమిషాల శ్రీవారి దర్శనం.. ట్రోల్స్‌పై శివానీ నగరం స్పందన

కలం, డెస్క్ : లిటిల్ హార్ట్స్ సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది శివానీ నగరం (Shivani Nagaram). వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. మొన్న ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తనకు తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనం 15 నిమిషాలు అయింది అంటూ చెప్పింది. దీంతో నెటిజన్లు పెద్ద ఎత్తున ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. సామాన్య జనాలకు 10 సెకన్లు కూడా దర్శనానికి టైమ్ ఇవ్వరు. కానీ ఈమెకెందుకు అంత టైమ్ ఇచ్చారు.. సెలబ్రిటీలు వస్తే చాలు దగ్గరుండి స్పెషల్ దర్శనాలు చేయిస్తారా అంటూ టీటీడీ (TTD) అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈమె ఏమైనా స్పెషలా అంటూ ఏకిపారేస్తున్నారు నెటిజన్లు.

దీంతో శివానీ నగరం (Shivani Nagaram) తన వ్యాఖ్యలపై స్పందించింది. ‘నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. 15 నిమిషాలు నాకు దర్శనం అయింది అనేది వైరల్ చేస్తున్నారు. కానీ నేను వెళ్లింది శ్రీవాణి దర్శనం. శ్రీవాణి క్యూలైన్ లో నిల్చున్నప్పటి నుంచే స్వామివారు కొంచెం కొంచెం కనిపిస్తుంటారు. అలా 15 నిమిషాల దాకా క్యూ లైన్ లోనే ముందుకు వెళ్తూ స్వామివారిని చూస్తూ ఉండిపోయాను. అదే నేను చెప్పాను. అంతే గానీ స్వామి వారి ముందు 15 నిమిషాలు నేను ఉండలేదు. అందరి లాగానే కొన్ని సెకన్లలోపే దర్శనం చేసుకున్నాం. మీరు కూడా శ్రీవాణి టికెట్ తీసుకుంటే స్వామివారు దగ్గరి నుంచే దర్శనం అవుతారు’ అంటూ చెప్పుకొచ్చింది శివానీ నగరం.

Read Also: ఫ్యామిలీ సూసైడ్స్ – పెరిగిపోతున్న విపరీత ధోరణి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!