కలం, డెస్క్ : మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ (Bill Gates) సంచలన విషయాన్ని బయట పెట్టారు. ఎప్ స్టీన్ తో రిలేషన్ ఉన్న మాట నిజమే అని.. అందుకు తాను ఎంతో చింతిస్తున్నట్టు తెలిపారు. అయితే చట్ట వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేయలేదని.. తనపై వస్తున్నవి తప్పుడు ఆరోపణలు అంటూ కొట్టి పారేశారు. కాకపోతే ఇద్దరు రష్యన్ మహిళలతో ఎఫైర్ ఉన్న మాట వాస్తవమే అని అంగీకరించారు. తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ వీటిపై స్పందించారు.
తాను ఎప్ స్టీన్ (Epstein) బాధితులను ఎన్నడూ కలవలేదని.. ఎలాంటి తప్పుడు పనులు చేయలేదని చెప్పుకొచ్చారు బిల్ గేట్స్ (Bill Gates). తనను ఆదర్శంగా తీసుకునే వారందరికీ ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే నిజాలు ప్రపంచం ముందు ఉంచుతున్నట్టు చెప్పారు. ఎప్ స్టీన్ పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎంత సంచలనం రేపుతుందో మనం చూస్తూనే ఉన్నాం. బిల్ గేట్స్ పేరు ఉండటంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
Read Also: అనిల్ అంబానీకి బిగ్ షాక్.. రూ. 3,716 కోట్ల లగ్జరీ ప్రాపర్టీ సీజ్
Follow Us On: Instagram

