Mobile Popup Ad
Mobile Popup Ad

మహబూబాబాద్‌లో అకాల వర్షం.. రైతులకు తీవ్ర నష్టం

కలం, మహబూబాబాద్: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో బుధవారం కురిసిన అకాల వర్షం, ఈదురు గాలులు కొత్తగూడ మండల రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బ తీశాయి. ముఖ్యంగా కొత్తపల్లి గ్రామ పరిధిలో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టం కావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. భారీ ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. చేతికొచ్చే దశలో ఉన్న మొక్కజొన్న పంట నేలవాలింది. భారీగా పెట్టుబడి పెట్టి, కంటికి రెప్పలా కాపాడుకున్న పంట కళ్లముందే దెబ్బతినడంతో రైతులు (Farmers)  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దెబ్బ తిన్న పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.

Read Also:  నల్లగొండలో రూ.193 కోట్ల సీఎంఆర్ స్కామ్.. అయినా మంత్రి ఉత్తమ్ కామ్!!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>