కలం, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్ట్‌ల (Courts)కు బాంబు బెదిరింపులు (Bomb Threat) రావడం కలకలం రేపింది. హైదరాబాద్ (Hyderabad) లోని నాంపల్లిలో ఉన్న సీబీఐ కోర్ట్, విశాఖపట్నం (Visakhapatnam)లోని జిల్లా కోర్ట్‌ల్లో బాంబులు పెట్టామంటూ దుండగులు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు గురి చేశారు. వెంటనే అప్రమత్తమైన కోర్ట్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఆయా కోర్టుల్లో లాయర్లు, స్టాఫ్‌ను బయటకు పంపించి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టారు. కొద్ది రోజుల క్రితమే కరీంనగర్, నాంపల్లి, వైజాగ్ కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే తనిఖీలు చేపట్టిన పోలీసులు అది ఫేక్ బెదిరింపుగా గుర్తించారు. మళ్లీ పది రోజులు తిరగక ముందే మరోసారి బెదిరింపు రావడం భయాందోళన కలిగిస్తోంది. తనిఖీలు పూర్తయ్యాక పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
Read Also: నేపాల్ లో గణపతి .. కీలక వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

