epaper
Sunday, March 1, 2026
epaper

ఆల‌స్యంగా వ‌చ్చిన విద్యార్థులు.. ప‌రీక్ష‌కు అనుమ‌తించని అధికారులు!

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ (Telangana) వ్యాప్తంగా నేడు ఇంట‌ర్‌ ప‌రీక్ష‌లు (Inter Exams) ప్రారంభ‌మ‌య్యాయి. ప‌లువురు విద్యార్థులు స‌కాలంలో ప‌రీక్ష కేంద్రాల‌కు చేరుకోలేక‌పోయారు. ఐదు నిమిషాలు ఆల‌స్యంగా వ‌చ్చినా అనుమ‌తిస్తామ‌ని అధికారులు ముందే చెప్పారు. అయితే విద్యార్థులు అంత‌కు మించి ఆల‌స్యంగా వ‌చ్చారు. దీంతో అధికారులు జగిత్యాల, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో ఇద్దరు విద్యార్థినులను ప‌రీక్ష కేంద్రంలోకి అనుమ‌తించ‌లేదు. దీంతో నిరాశ‌తో గేటు బ‌య‌టే ఆగిపోయారు. చాలాసేపు అధికారుల‌ను రిక్వెస్ట్ చేసుకున్నా లోప‌లికి రానివ్వ‌లేదు. వ‌చ్చే నెల 18వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష‌లు జ‌రుగ‌నున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1495 పరీక్ష కేంద్రాల్లో 9.97 లక్షల మంది విద్యార్థులు ప‌రీక్ష‌లు రాస్తున్నారు. విద్యార్థులు స‌కాలంలో ప‌రీక్ష కేంద్రాల‌కు చేరుకోవాల‌ని అధికారులు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!