కలం, వెబ్ డెస్క్: సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ (PV Sunil Kumar) సంచలన ప్రకటన చేశారు. తాను త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు తెలిపారు. తనను కొంతమంది కావాలనే టార్గెట్ చేసి వేధిస్తున్నారని ఆరోపించారు. ఏపీ పోలీసులు ఏదో ఒక కేసులో తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని చెప్పారు. రఘురామ కృష్ణం రాజు కేసులో తాను సస్పెండ్ కాలేదని, విదేశాలకు వెళ్లినందుకు సస్పెండ్ చేశారని వెల్లడించారు. రఘురామను తాను వేధించలేదని స్పష్టం చేశారు. తప్పుదు ఆధారాలతో తనను కేసుల్లో ఇరికిస్తున్నారని, రఘురామ ఒత్తిడితోనే అధికారులు వేధిస్తున్నారని ఆరోపించారు. పీడిత జనాల కోసం రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. ఏ రాజకీయ పార్టీలో చేరబోనని, కాపులతో కలిసి అణగారిన వర్గాల కోసం పని చేస్తానని చెప్పారు.

