కలం, వెబ్ డెస్క్: రాజమండ్రి (Rajahmundry) కల్తీ పాల ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇప్పటి వరకు పాల ప్యాకెట్లపై అపోహలు ఉండగా ఇప్పుడు చిరు వ్యాపారులు పోస్తున్న డబ్బా పాలపైనా అనుమానాలు మొదలయ్యాయి. మార్కెట్లో పాలు కొనాలన్నా, చిన్న పిల్లలకు తాగించాలన్నా ప్రజలకు భయం పట్టుకుంది. రాజమండ్రి ఘటనతో విశాఖపట్నంలో (Visakhapatnam) అధికారులు అప్రమత్తమయ్యారు. పాల కేంద్రాలపై తనిఖీలు నిర్వహించారు. పాల నాణ్యతపై అప్పటికప్పుడు పరీక్షలు చేపట్టారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కి పంపించారు. ప్రజలకు నాణ్యమైన పాలు అమ్మాలని, ఎలాంటి రసాయనాలు కలపకూడదని వ్యాపారులను హెచ్చరించారు.

