epaper
Sunday, March 1, 2026
epaper

విదేశీ మద్యం కేసులో ట్విస్ట్.. ధ్వంసం చేయాల్సిన మద్యం ఏమైంది!

కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లా నర్సాపూర్ (మం) కాగజ్ మద్దూర్​లోని మరిడి బయో ఇండస్ట్రీస్​లో అక్రమంగా నిల్వ ఉంచిన విదేశీ మద్యం కేసుపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. హైదరాబాద్​లో పట్టుబడ్డ విదేశీ మద్యం బాటిళ్లను ధ్వంసం చేయడానికి కస్టమ్స్ అధికారులు తీసుకొచ్చారు. సుమారు 40 లక్షలకుపైగా విలువైన 783 విదేశీ మద్యం బాటిళ్లను (Foreign Liquor Bottles) ధ్వంసం చేయకుండా ఉద్యోగులు దాచిపెట్టారు. ఈ విషయమై మంగళవారం ఎక్సైజ్, ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు దాడి చేసి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

మెదక్ (Medak) జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్​ శ్రీనివాసరెడ్డి కేసు వివరాలను తెలిపారు. మరిడి బయో ఇండస్ట్రీస్​లో ఆస్పత్రుల వ్యర్థాలను ధ్వంసం చేస్తారు. అలాగే అక్రమ గంజాయి, మద్యం, విదేశీ మద్యం బాటిల్స్ ఇక్కడే ధ్వంసం చేస్తారు. గత నెలలో హైదరాబాద్‌ (Hyderabad)లో  విదేశీ మద్యం పట్టుబడితే తరలించారు. ఇండస్ట్రీస్​లో పనిచేస్తున్న ఉద్యోగులు అభయ్ కుమార్, షేక్ నాగుల్, మీరాకుమార్, సాయి రాజేశ్​ దాచిపెట్టారు. విదేశీ మద్యం తాగినట్టు కూడా ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేసి భారీగా విదేశీ మద్యాన్ని సీజ్​ చేశారు. ఈ ఘటనలో ఉద్యోగుల చేతివాటమా లేక అధికారుల నిర్లక్ష్యమా అనేది తెలియాల్సి ఉంది.

Read Also: వరంగల్ జిల్లాలో బయటపడ్డ భారీ కాలేజ్ స్కామ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!