epaper
Sunday, March 1, 2026
epaper

ట్రేడ్​ డీల్​ను కోర్టు కొట్టేసింది.. మీకు ధైర్యం లేదా? : రాహుల్​ ​

కలం, వెబ్​ డెస్క్​: అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్​సభలో ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ (Rahul Gandhi) మరోసారి తీవ్రంగా విమర్శించారు. ఈ డీల్​ చట్ట విరుద్ధమని అమెరికాలోని కోర్టు కొట్టేసిందని, ఆపాటి ధైర్యం మీకు లేదా? అని ప్రధాని మోదీని ప్రశ్నించారు. ప్రధాని ధైర్యముంటే ట్రేడ్​ డీల్​ను రద్దు చేయాలని సవాల్​ విసిరారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్​ జరిగిన ‘కిసాన్​ మహాచౌపాల్​’ రైతు ర్యాలీలో రాహుల్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూఎస్​తో ట్రేడ్​ డీల్​ను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం.. భారత రైతుల గుండెల్లో గునపం లాంటిదన్నారు.

‘ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు ట్రేడ్​ డీల్​ను రద్దు చేసింది. ఆ తీర్పు తర్వాత అయినా వాణిజ్య ఒప్పందాన్ని ప్రధాని మోదీ రద్దు చేయలేరా? ధైర్యముంటే ఈ డీల్​ను ప్రధాని రద్దు చేయాలని సవాల్​ విసురుతున్నాను. కానీ, ఆయన అలా చేయలేరు’ అని రాహుల్​ వ్యాఖ్యానించారు. యూఎస్​తో ఎఫ్​టీఏ భారత రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకమని పునరుద్ఘాటించారు. ఎప్​స్టీన్​ ఫైల్స్​ కారణంగా, పారిశ్రామికవేత్త అదానీని రక్షించేందుకు ఈ ఒప్పందంపై మోదీ సంతకం చేశారని రాహుల్​ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఒత్తిడికి ప్రధాని లొంగిపోయారని వ్యాఖ్యానించారు.

‘ఇది ఒప్పందం కాదు.. దేశ రైతుల గుండెల్లో గుచ్చిన గునపం’ అని రాహుల్(Rahul Gandhi) అన్నారు. ఈ డీల్​ ద్వారా వ్యవసాయం, డేటా, టెక్స్​టైల్​, దిగుమతి రంగాల ప్రయోజనాలపై ప్రధాని రాజీ పడ్డారని ఆయన ఆరోపించారు. దీనిపై నిలదీస్తాననే లోక్​సభలో తనను మాట్లాడనివ్వలేదని అన్నారు. కాగా, కిసాన్​ మహాచౌపాల్​ కార్యక్రమంలో కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు ఆ పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!