కొత్త పార్టీ జెండా ఎగరేసిన శశికళ.. త్వరలోనే పేరు

కలం, డెస్క్ : తమిళ (Tamil Nadu) రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. దివంగత మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ (Sasikala) సంచలన ప్రకటన చేశారు. అతి త్వరలోనే కొత్త పార్టీ పెడుతున్నట్టు తెలిపారు. పార్టీ పేరును త్వరలోనే చెబుతానన్నారు. ఈ మేరకు పార్టీ జెండాను ఆవిష్కరించారు. జయలలిత (Jayalalitha), అన్నాదురై, ఎంజీఆర్ (MGR) గుర్తులతో పార్టీ జెండాను డిజైన్ చేశారు. తెలుపు, నలుపు, ఎరుపు రంగులతో జెండాను తయారు చేయించారు.

తమిళ రాజకీయాల్లో తన మార్క్ చూపిస్తానని శశికళ (Sasikala) తెలిపారు. ద్రవిడుల ఆకాంక్షలు జయలలిత పాలనతోనే ఆగిపోయాయని.. వాటిని తానే ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నీ అవకాశ వాదులుగా మారిపోయాయని విమర్శించారు. మొన్నటి దాకా ఏఐఏడీఎంకే పార్టీలో ఆమె కొనసాగారు. అయితే పళనిస్వామి, పన్నీర్ సెల్వంతో ఆమెకు విభేదాలు రావడంతో ఆ పార్టీ నుంచి దూరంగానే ఉంటున్నారు. ఇప్పటికే విజయ్ పార్టీ (Vijay TVK Party) పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శశికళ కూడా పార్టీ పెడితే.. తమిళ రాజకీయాలు మరింత రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also: ట్రేడ్​ డీల్​ను కోర్టు కొట్టేసింది.. మీకు ధైర్యం లేదా? : రాహుల్​ ​

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>