epaper
Sunday, March 1, 2026
epaper

ఫుల్‌టైమ్ డీజీపీ ఎవరు? రేస్‌లో సీవీ ఆనంద్, శిఖా గోయల్..

కలం, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం డీజీపీగా (Telangana DGP) ఉన్న శివధర్‌రెడ్డికి (Shivadhar Reddy) ఫుల్ టైమ్ డీజీపీగా కొనసాగే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు అర్హత కలిగిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ల జాబితాలో శివధర్‌రెడ్డి పేరు ఉన్నప్పటికీ యూపీఎస్సీ (UPSC) నాలుగు రోజుల క్రితం కొర్రీలు పెట్టినట్లు సచివాలయ వర్గాల సమాచారం. ఆరు నెలల కనీస సర్వీసు ఉండాలన్న నిబంధన విషయంలో శివధర్‌రెడ్డికి ఛాన్స్ లేదన్నది ఆ వర్గాల సమాచారం. ఏప్రిల్ 30న ఆయన రిటైర్‌ కానున్నందున ఆ పదవి, బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. గతేడాది అక్టోబరు నుంచి తాత్కాలిక డీజీపీగా కొనసాగుతున్న ఆయన స్థానంలో ఫుల్ టైమ్ డీజీపీగా ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. యూపీఎస్సీ షార్ట్ లిస్టు చేసిన పేర్లలో ముఖ్యమంత్రి ఎవరిని ఎంపిక చేసి ఆ బాధ్యతలు అప్పజెప్తారన్నది సస్పెన్స్.

రేసులో సీవీ ఆనంద్, శిఖాగోయల్ :

సీనియారిటీ ప్రకారం చూస్తే 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ (CV Anand), 1994 బ్యాచ్‌కు చెందిన శిఖాగోయల్ (Shikha Goel), సౌమ్యామిశ్రా, వినాయక్ ప్రభాకర్ ఆప్టే తదితరులు యూపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం తయారుచేసి పంపిన ప్యానెల్‌లో ఉన్నారు. వీరిలో ముగ్గురిని యూపీఎస్సీ ఫిల్టర్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతుంది. ఇందులో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం పైనల్ చేసి డీజీపీగా (Telangana DGP) నియమిస్తుంది. సీవీ ఆనంద్ ఇతర అధికారులకంటే సీనియర్. దీంతో ఆయనకు డీజీపీ అయ్యే అవకాశాలున్నాయి. కానీ ముఖ్యమంత్రి ఛాయిస్ ఎవరికన్నది ఆసక్తికరంగా మారింది. విధి నిర్వహణలో సిన్సియర్‌గా ఉంటారని, నగర పోలీసు కమిషనర్‌గా పనిచేసిన అనుభవం, ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా మొత్తం పోలీసు వ్యవస్థపైన పట్టు.. ఇవన్నీ ఆయనకు అనుకూల అంశాలు. అయితే ఆయనవైపు సీఎం ఏ మేరకు మొగ్గు చూపుతారన్న అనుమానాలున్నాయి.

ఫస్ట్ మహిళా డీజీపీ క్రెడిట్ దక్కేనా? :

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోగానీ, తెలంగాణలోగానీ ఇప్పటివరకు ఫుల్ టైమ్ డీజీపీగా మహిళా అధికారులకు అవకాశం దక్కలేదు. శిఖా గోయల్, సౌమ్యా మిశ్రా డీజీపీ స్థాయి అధికారులుగా ఉన్నా పోలీస్ ఫోర్స్ హెడ్‌గా పూర్తిస్థాయి డీజీపీ అవకాశాలు రాలేదు. పలు విభాగాల హెడ్‌లుగా మహిళా ఐపీఎస్‌లు పనిచేస్తున్నా, వారికి డీజీపీ ర్యాంక్ ఉన్నా ఫుల్ టైమ్ డీజీపీగా నియమితులు కాలేదు. ఇప్పుడు డీజీపీ పోస్టుకు ఈ ఇద్దరు మహిళా ఐపీఎస్‌లు అర్హత ఉన్నందున ఎవరికి అవకాశం దక్కుతుందనేది పోలీసు వర్గాల్లో జరుగుతున్న చర్చ. సీనియారిటీ ప్రకారం సీవీ ఆనంద్ ఎంపికపై సీఎం ప్రతికూల నిర్ణయం తీసుకుంటేనే మహిళా డీజీపీ అంశం తెరపైకి వస్తుంది. శిఖాగోయల్ 2029 మార్చి వరకు, సౌమ్యా మిశ్రా 2027 డిసెంబరు వరకు సర్వీసులో కొనసాగనున్నారు. మరోవైపు వినాయక్ ప్రభాకర్ ఆప్టే ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నందున ఆయన విషయంలో సీఎం నిర్ణయం కీలకం కానున్నది.

Read Also: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ టార్గెట్ ఫెయిల్.. రూ.95 కోట్లు వృధా!!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!