epaper
Sunday, March 1, 2026
epaper

ప్రపంచకప్‌లో భారత్‌కు కష్టకాలం.. సెమీస్ చేరాలంటే అద్భుతం జరగాల్సిందే!

కలం, స్పోర్ట్స్:  టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026) అప్రహతిహతంగా దూసుకుపోతున్న టీమ్ ఇండియాకు (Team India) ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. గ్రూప్ స్టేజ్‌లో అజేయంగా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ సేన, సూపర్-8 తొలి పోరులో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఓడిపోవడంతో భారత్ సెమీఫైనల్ అవకాశాలు ఇప్పుడు సంక్లిష్టంగా మారాయి.

తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 187/7 పరుగుల భారీ స్కోరు సాధించింది. డేవిడ్ మిల్లర్ (63), డెవాల్డ్ బ్రెవిస్ (45) మెరుపులు మెరిపించగా, భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 15 పరుగులకే 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నారు. అయితే, 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. ఈ భారీ ఓటమితో భారత నెట్ రన్ రేట్ (NRR) మైనస్ 3.800కు పడిపోయింది.

పాయింట్ల పట్టికలో పరిస్థితి

సూపర్-8 గ్రూప్-1లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ చెరో విజయంతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ విజయం సాధించడంతో భారత్ ప్రస్తుతం మూడో స్థానానికి పడిపోయింది.

సెమీస్ చేరాలంటే ఏం చేయాలి?

భారత్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఫిబ్రవరి 26న చెన్నైలో జింబాబ్వేతో, మార్చి 1న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో తలపడనుంది.

మొదటి మార్గం.. భారత్ తన తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ భారీ తేడాతో గెలవాలి. అప్పుడు భారత్‌కు 4 పాయింట్లు వస్తాయి. ఒకవేళ దక్షిణాఫ్రికా తన మిగతా మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే, భారత్ రెండో జట్టుగా సెమీస్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇతర జట్లు కూడా 4 పాయింట్లతో సమానంగా ఉంటే, నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది.

రెండొ మార్గం: ఒకవేళ భారత్ (Team India) ఒకే మ్యాచ్ గెలిస్తే, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అప్పుడు కూడా రన్ రేట్ లెక్కలే భారత్ భవిష్యత్తును తేలుస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్ భారత్‌కు చావోరేవో లాంటిది. ఒత్తిడిని అధిగమించి టీమ్ ఇండియా పుంజుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Read Also: టీ20 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్ రికార్డు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!