Mobile Popup Ad
Mobile Popup Ad

బావని కిరాతకంగా హత్య చేసిన మరదలు !

కలం, వరంగల్ బ్యూరో : హనుమకొండ (Hanumakonda) జిల్లాలో హత్య ఘటన కలకలం రేపింది. హసన్‌పర్తి మండలం సిద్ధాపురం గ్రామంలో బాల్నే మొగిలి అనే వ్యక్తి అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యాడు. అతడి మరదలే ఈ దారుణానికి పాల్పడటం స్థానికంగా సంచలనం సృష్టించింది. సోమవారం రాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనలో మొగిలిని గొడ్డలి, కత్తులతో దారుణంగా పొడిచి చంపినట్లు  సమాచారం అందుతోంది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే హసన్‌పర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>