Mobile Popup Ad
Mobile Popup Ad

మోహ‌న్‌బాబు యూనివ‌ర్సిటీ విద్యార్థిని సూసైడ్‌

క‌లం, వెబ్ డెస్క్‌: తిరుప‌తి (Tirupati)లో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. మోహ‌న్ బాబు యూనివ‌ర్సిటీ (Mohan Babu University)లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి భువన ఆత్మహత్య చేసుకుంది. ప్రైవేట్ హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్ప‌డింది. భువ‌న స్వ‌స్థ‌లం పుంగ‌నూరు మండ‌లంలోని మంగ‌ళం గ్రామం. ఆమె సాయితేజ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ ఎంబీయూలో చ‌దువుకుంటోంది. ఇటీవ‌ల భువ‌న‌కు క్యాంప‌స్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం కూడా వ‌చ్చింది. భువ‌న ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌న్న విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని ప‌రిశీలించారు. భువ‌న మృతదేహాన్ని తిరుప‌తిలోని రుయా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆస్పత్రి వద్ద భువన తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>