కలం, వెబ్ డెస్క్ : రష్యా రాజధాని మాస్కో (Moscow)లో మంగళవారం తెల్లవారుజామున పెను ప్రమాదం సంభవించింది. నగర నడిబొడ్డున ఉన్న సవ్యోలోవ్స్కీ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి పోలీసు పెట్రోలింగ్ వాహనం లక్ష్యంగా పేలుడుకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి దాటాక ఈ ఘటన జరిగినట్లు మాస్కో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ భారీ పేలుడులో దాడికి పాల్పడిన వ్యక్తితో పాటు ఒక పోలీసు అధికారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వాహనంలో ఉన్న మరో ఇద్దరు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. గాయపడిన అధికారులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి వెనుక ఉన్న కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

