epaper
Monday, February 23, 2026
epaper

బ్యాంకుల ‘మిస్​–సెల్లింగ్​’ నేరం​ : నిర్మలా సీతారామన్​

కలం, వెబ్​ డెస్క్​: బ్యాంకులు ఆర్థిక ఉత్పత్తులను కస్టమర్లకు అమ్మడంపై (Banks Mis Selling) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్​ అనంతరం ఆర్థిక మంత్రి ఏటా రిజర్వు బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(ఆర్​బీఐ) సెంట్రల్​ బోర్డుతో నిర్వహించే సంప్రదాయ సమావేశం సోమవారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశం అనంతరం విలేకరులతో కేంద్ర మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా బ్యాంకులు ఆర్థిక ఉత్పత్తులు అమ్మడంపై వ్యాఖ్యానించారు.

‘బ్యాంకులు దేనికోసమైతే ఉన్నాయో ఆ పనిపైనే అవి దృష్టి పెట్టాలి. అదే వాటి డ్యూటీ. అంతేకానీ, కస్టమర్లకు అవసరం లేని/ఇష్టపడని ఇన్సూరెన్స్​లు వంటి ఆర్థిక ఉత్పత్తులను తప్పుదోవ పట్టించే విధంగా అమ్మడం(మిస్​–సెల్లింగ్​) వాటి పని కాదు. దీనివల్ల ఆర్​బీఐ, ఐఆర్​డీఏఐలతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. బ్యాంకుల మిస్​–సెల్లింగ్​పై నాకు మొదటి నుంచీ ఆందోళన ఉంది. ఇలాంటి చర్యలు భారతీయ న్యాయ సంహిత ప్రకారం నేరం’ అని ఆమె స్పష్టం చేశారు.

కాగా, మిస్​–సెల్లింగ్​పై (Banks Mis Selling) ఈ నెల 11న ఆర్​బీఐ ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. వాటి ప్రకారం.. కస్టమర్‌ను తప్పుదోవ పట్టించి ఇన్సూరెన్స్​ లేదా క్రెడిట్​ కార్డ్​ వంటి ఉత్పత్తి/సేవను విక్రయించినట్లు తేలితే.. సంబంధిత బ్యాంకులు కస్టమర్ చెల్లించిన సొమ్ము మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. అలాగే ఆ మిస్-సెల్లింగ్ వల్ల కలిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలి. ఈ ముసాయిదాపై ప్రజలు తమ అభిప్రాయాలను వచ్చే నెల 4వ తేదీ వరకు తెలపవచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>