కలం, డెస్క్ : హైదరాబాద్ లో (Hyderabad) వర్షం మొదలైంది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం పట్టణాన్ని తాకింది. సిటీ మొత్తం మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఎఫెక్ట్ తో ఆర్టీసీ క్రాస్ రోడ్, ఖైరతాబాద్, కాచిగూడ, ముషీరాబాద్, లక్డీకపూల్ లో చిరు జల్లులు పడుతున్నాయి. కొద్ది రోజలుగా ఎండలు మండుతున్న తరుణంలో వాన తాకిడిని సిటీ ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. అటు మేడ్చల్, మల్కాజిగిరి ఏరియాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. వర్షం మరీ ఎక్కువగా పడకుండా.. చిరు జిల్లులుగా పడుతోంది. దీని వల్ల పెద్ద ప్రభావం ఉండదని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.


