epaper
Monday, February 23, 2026
epaper

అభిషేక్ అసలు సమస్యేంటో చెప్పిన గవాస్కర్

కలం, స్పోర్ట్స్:  సూపర్ 8లో దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓటమి చవిచూసింది. తాజా పరిణామంగా ఈ మ్యాచ్‌లోనే వరుసగా మూడు డకౌట్ల తర్వాత అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన ఖాతా తెరిచినా, కేవలం 15 పరుగులకే ఔటై మరోసారి నిరాశ మిగిల్చాడు. టీమిండియా తరఫున ఆడుతున్న అభిషేక్ శర్మ ఈ టోర్నీలో ప్రారంభ మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో టీ20 వరల్డ్ కప్‌లో తన తొలి పరుగులు సాధించాడు. అయితే పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఈ ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) స్పందించారు. నెట్స్‌లో ఔటైనా వెంటనే మరో బంతిని ఎదుర్కొనే అవకాశం ఉంటుందని, కానీ మ్యాచ్ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని ఆయన విశ్లేషించారు. ఒత్తిడి ఆటగాడిని కట్టిపడేస్తుందని పేర్కొన్నారు. పెద్ద షాట్లు ఆడకుండా నిరోధిస్తుందని తెలిపారు.

అభిషేక్ ఒత్తిడివల్ల స్వేచ్ఛగా ఆడలేకపోయాడని గావస్కర్ (Sunil Gavaskar) అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికా బౌలర్లు తెలివైన వ్యూహంతో బౌలింగ్ చేశారని చెప్పారు. అతడు రూమ్ తీసుకుని ఆఫ్‌సైడ్‌లో షాట్లు ఆడతాడని వారికి ముందే తెలుసని వివరించారు. ఒక సిక్స్ ఇచ్చిన తర్వాత కూడా రబాడ అతని ప్యాడ్లను లక్ష్యంగా చేసుకుని క్రమబద్ధంగా బౌలింగ్ చేశాడని తెలిపారు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ప్రణాళిక స్పష్టంగా పనిచేసిందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. టీమ్ ఇండియా తదుపరి మ్యాచ్‌ల్లో ఒత్తిడిని అధిగమించి బలమైన ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది.

Read Also: జింబాబ్వేతో పోరు.. వెస్టిండీస్ టార్గెట్ ముజరబాని

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>