కలం, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamil Nadu)లో ఎన్నికలు సమీపిస్తుండటంతో టీవీకే చీఫ్ విజయ్ దూకుడు పెంచారు. భారీ సభలు, వరుస పర్యటనలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఒకవైపు తమిళనాడు సీఎం స్టాలిన్‌పై విరుచుకుపడుతూనే.. మరోవైపు కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వేలూరు వేదికగా జరిగిన తమిళగ వెట్రి కళగం బహిరంగ సభలో విజయ్ అధికార డీఎంకే, బీజేపీలను టార్గెట్ చేశారు.
రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికలు కేవలం విజయ్‌కు, స్టాలిన్‌కు మధ్య జరిగే పోరు మాత్రమేనని స్పష్టం చేశారు. “తమిళనాడు అంటే విజయ్, విజయ్ అంటే తమిళనాడు” అని పేర్కొంటూ తన రాజకీయ ప్రాముఖ్యతను చాటుకున్నారు. సిద్ధాంతపరంగా బీజేపీ తన శత్రువు అని చెబుతూనే, క్షేత్రస్థాయిలో తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి డీఎంకే అని విజయ్ తేల్చి చెప్పారు. ఈ ఎన్నికలు తమిళనాడు భవిష్యత్తును మార్చేవని ఆయన అన్నారు.


