epaper
Friday, January 16, 2026
spot_img
epaper

అయోధ్య రామాలయంపై కాషాయజెండా ఎగరేసిన ప్రధాని

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Modi) మంగళవారం అయోధ్యలో రామ జన్మభూమి మందిరం(Ayodhya Ram Temple) గర్భగుడి శిఖరంపై 22 అడుగుల ఎత్తైన భారీ కాషాయ ధ్వజాన్ని ఆవిష్కరించారు. అభిజిత్ ముహూర్తంలో జరిగిన ఈ ధ్వజారోహణ కార్యక్రమంతో రామమందిర నిర్మాణం ప్రధాన దశ పూర్తయిందని ఆగమశాస్త్ర పండితులు చెబుతున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ తదితరుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. సుమారు 7,000 మంది సాధు, సన్యాసులు, ప్రముఖులు హాజరయ్యారు. 11 కేజీల బరువున్న ఈ కాషాయ ధ్వజంపై సూర్య చిహ్నం, ‘ఓం’, కోవిదార వృక్షం ఉన్నాయి. ధ్వజం 10×20 అడుగుల పరిమాణంలో ఉంది.

మోడీ భావోద్వేగ ప్రసంగం

“ఎన్నో శతాబ్దాలుగా భారతీయుల హృదయంలో ఉన్న గాయం ఈ రోజు మానిపోతోంది. ప్రాణం పోయినా మాట తప్పకూడదు. అనే సంకల్పం నేడు పూర్తి రూపం దాల్చింది. నేడు ఎత్తిన ఈ ధర్మ ధ్వజం పేదరికం, బాధలు, వివక్షలు లేని సమాజ నిర్మాణానికి స్ఫూర్తినిస్తుంది. ఇది హిందూ నాగరికత పునరుజ్జీవనానికి చిహ్నం” అని భావోద్వేగంతో పేర్కొన్నారు.

రామమందిర(Ayodhya Ram Temple) నిర్మాణానికి ప్రాణాలర్పించిన కరసేవకులు, ఈ ఉద్యమంలో భాగమైన ప్రతి భక్తుడికీ నివాళులర్పించారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం రామ వివాహ పంచమి సందర్భంగా ఈ ధ్వజారోహణ జరగడం విశేషం. ఉదయం నుంచి ప్రధాని మోడీ సప్త మందిరాలు, శేషావతార మందిరం, అన్నపూర్ణ మందిరం దర్శనం చేసుకున్నారు. అనంతరం భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమంతో శ్రీరామ జన్మభూమి మందిరం పూర్తి స్థాయి ప్రారంభానికి మరో అడుగు దగ్గరయిందని ట్రస్ట్ వర్గాలు తెలిపాయి.

Read Also: వరల్డ్ లో ఫోర్త్ బెస్ట్ సిటీగా హైదరాబాద్

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>