epaper
Monday, February 23, 2026
epaper

నిజామాబాద్‌లో వర్షం.. చల్లబడిన వాతావరణం

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచి వర్షం ప్రారంభమైంది. నిజామాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. వాస్తవానికి గత వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. 11 గంటల కల్లా రోజూ 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు కనిపించాయి. ఈరోజు ముసురుతో 28 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదయ్యాయి. గత రెండు మూడు రోజుల్లో ఎండాకాలం ప్రభావం స్పష్టంగా కనిపించింది. మధ్యాహ్నానికి 30 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం మాత్రం తేలిక పాటి వర్షాలతో వాతావరణం మొత్తం చల్లబడింది. ఎండాకాలం ఆరంభంలో ఇదో ఉపశమనంగా కూడా చూడవచ్చు. నిజామాబాద్‌తో పాటు కామారెడ్డి (Kamareddy) జిల్లాలోనూ ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>